• phone +91 7995014506

TDP EMPOWERMENT CENTRE

తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఎంపవర్మెంట్ సెంటర్. ఇది పార్టీ అనుబంధ విభాగం అయిన ఎన్నారై టిడిపి కలలకు ప్రతిరూపం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సానుభూతిపరులే కాదు సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆర్థిక స్వావలంబన కోసం ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. అధికారంలో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా పేదలకు సాయం చేయడంలో తెలుగుదేశం ముందుంటుందని నిరూపించిన వ్యవస్థ ఇది. 

2019 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని చెప్పాలి. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటి లేకపోగా ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ నుంచి పారిపోయాయి. దీంతో విద్యార్థుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ వేలాది మందికి ఉద్యోగాలు దేశ విదేశాలలో కల్పించే బృహత్తర బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకుంది. 

ఈ ఒక్క ఏడాదిలొనే సుమారుగా 300 మంది టీచర్లను మరియు టీచర్ అసిస్టెంట్లను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఉద్యోగ నియామకంపై నేరుగా పంపే ప్రాజెక్టును చేపట్టి అమలు చేస్తున్నది. గత ఏడాది టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా వంద మంది ఉపాధ్యాయులుగా అమెరికాలో నియామకం పొంది హాయిగా జీవిస్తున్నారు. .  అదేవిధంగా జర్మనీ స్వీడన్ నార్వే బ్రిటన్ వంటి అనేక యూరోప్ దేశాలకు ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.  వీటికి సంబంధించిన ఎంపికలు ఇప్పుడు జరుగుతున్నాయి. మరోవైపు జెసిబి ట్రక్ డ్రైవర్లు ఎలక్ట్రిషియన్లు ఫిట్టర్లు ప్లంబర్లు వంటి మరెన్నో సాంకేతిక సిబ్బందికి గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పించే పనిని చేపట్టింది.

దేశ విదేశాల్లోనే కాక స్థానికంగా కూడా ఎంబీఏ ఫైనాన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలను ఇప్పించే బాధ్యతను పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ చేపట్టింది. ఇప్పుడు సుమారుగా 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఉపాధి అవకాశాలు చూపించడమే కాదు అంతకుముందు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఈ సెంటర్ అందజేస్తుంది. శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా అందజేస్తుండటం గమనార్హం. అదేవిధంగా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు కూడా ఎంపవర్మెంట్ సెంటర్ అందజేస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఇంచార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్ ఆధ్వర్యంలో ఆలోచనలతో నడుస్తున్న ఈ ఎంపవర్మెంట్ సెంటర్ ఈ ఆధునిక కాలంలో ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ లా పనిచేస్తూ విద్య ఉపాధికి అడ్రస్ గా మారింది.

Address


☞NH16, opposite to Happy Resorts & Recreations, Mangalagiri, Andhra Pradesh 522503.
☏ +91 8950674837 , 7995014506


Social Media




Youtube Subscribe




© TDP Empowerment Copyright 2023 - 2024